Saturday, April 17, 2010 1 comments

ఎవరిని ప్రేమించాలి ..?

ఆత్మ సాక్చాత్కారం పరమోత్కృష్ట మైనదని తెలిసిన ఒకతను ఓ పరమ గురువు దగ్గరికి శిష్యరికం కోసం వెళ్ళాడు.
"స్వామీ ! దయతో నన్ను మీ శిష్యునిగా చేసుకోండి . మీ గురుత్వంతో నన్ను తరింప చేయండి ."
ప్రార్దిన్చాడతాను .
"నువు ఎక్కువగా ప్రేమించేది ఎవర్ని ?" ప్రశ్నించాడు గురువు .
"నా కుటుంబాన్ని నేనెల ప్రేమిస్తానో , నా బంధుమిత్రులని, వాల్లనేలా ప్రేమిస్తానో అలాగే నా దేశ ప్రజలని కూడా ప్రేమిస్తాను తప్ప నాకు ప్రత్యేకంగా ఎక్కువ ప్రేమించే వాళ్ళంటూ ఎవరు లేరు స్వామి ".
జవాబు చెప్పాడు అతను .
నువ్వింకా పరిపక్వత చెందలేదు .నీకు ప్రత్యేకంగా ఎవరిమేధైన ప్రేమ కలిగే దాకా ఆగి అప్పుడు రా ." చెప్పారా గురువు
అతను వెళ్ళిపోయి కొంతకాలానికి తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు .
" స్వామీ ! మీరు చెప్పినట్లుగా నా ప్రేమ మారింది .నేను మీ శిష్యుడునయ్యే అర్హత సంపాదించానని అనుకుంటున్నాను చెప్పాడు .
"ఇప్పుడు నువు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తునావు ?" అని ప్రశ్నించాడు గురువు .
"మాతృ దేవో భవ, పితృ దేవో భవ అన్నారు కదా ! నా తల్లి తండ్రుని నేనిప్పుడు అందరికన్నా అధికంగా
ప్రేమిస్తున్నాను ."
"నీ ప్రేమ వారినుంచి కూడా మరలేదాకా ఆగి ఆ తర్వాత వచ్చి కనబడు ." చెప్పాడు గురువు .
ఇంకొంచెం కాలము అయాక అతను మళ్లీ గురువు దగ్గరికి వచ్చి అడిగాడు .
" స్వామీ ! మళ్లీ నా ప్రేమ మరొకరి మీదకి మళ్ళింది . ఇప్పుడైనా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరిస్థారని ఆశించవచ్చా?"
"ఇప్పుడు నీ ప్రేమ ఎవరిమీద ఉంది ?" ప్రశ్నించాడు గురువు .
"పూర్తిగా ఆ భగవంతుడి మీదే స్వామి . విష్ణువు మీద నుంచి నా ప్రేమ పక్కకి మరలడం లేదు ."
"అయితే మరి కొంత కాలం వేచి ఉండు .నీ ప్రేమ మళ్లీ మరలాక వచ్చి కనబడు ."
" అసంభవం స్వామి !నా ప్రేమ నా ఇష్ట దైవం మీంచి ఇక మరలదు అనిపిస్తోంది ."
అయినా గురువు మాట మీద గౌరవం ఉంచి వెళ్ళిపోయాడు అతను .
మరి కొంతకాలానికి అతను తిరిగి ఆ గురువు దగ్గరికి వచ్చాడు .
"మీరు చెప్పినట్లుగా మళ్లీ నా ప్రేమ మళ్ళింది స్వామి ."
చెప్పాడతను .
"ఈ సారి ఎవరి మీదకి ?" చిరునవ్వుతో ప్రశ్నించాడు గురువు .
" ప్రపంచంలోని సర్వ ప్రాణి కోటి మీదకి . మనష్యులనే కాక నేనిప్పుడు ఇతర జీవులని కూడా సమానంగా ప్రేమిస్తున్నాను.
పూర్వం కేశవుడ్ని విగ్రహంలో చూసేవాడిని . కాని నాకిప్పుడు ఆ కేశవుడు సర్వ ప్రాణికోటిలో దర్శనం ఇస్తున్నాడు. ప్రతి జీవిలో పరమత్మున్నీ చూస్తున్నాను ."
" ఇప్పుడు నీకు ఇక గురువు తో పనిలేదు ."
దూరం నించే అతనికి ఆథ్యాత్మిక ప్రగతిని అందించిన ఆ గురువు చిరునవ్వుతో చెప్పాడు....
మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి రచించిన కథలు




Collected by మీనేస్తం ..........

1 Response to ఎవరిని ప్రేమించాలి ..?

April 17, 2010 at 6:51 AM
This comment has been removed by the author.

Post a Comment